Tuesday, February 7, 2017

సమాజానికే ఎరుక (దశ, దిశ) చెప్పిన బదనాపురం కృష్ణస్వామి- B.Krishana Swamy

బ్రిటిష్‌ పాలకుల నుండి భారతదేశానికి స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న రోజులవి. అలాగే సమాజంలో కులవ్యవస్థ తన ప్రతాపాన్ని చూపిస్తున్న కాలం. కుల నియమాలను కాదంటే కఠినమైన శిక్షలు అమలు జరుగుతున్న రోజులు. కులం పేరు చెప్పకుండా బయటకు వెళ్ళలేని పరిస్థితి, కులం పేరు చెబితే బయట తిరగలేని పరిస్థితి. రెండింటి మధ్య నలిగిపోయే వారు. ఎరుకుల కులం వృత్తిరీత్యా సోది చెప్పడం, బుట్టలు అల్లడం, పందుల పెంపకంతోపాటు వ్యవసాయ కూలీ పనులకు కూడా వెళ్ళేవారు. పందులు పెంచి, వాటిని విక్రయించగా వచ్చినదానితో కుటుంబాలను పోషించుకునేవారు. అలా చాలీచాలని డబ్బుతో ఆర్థాకలితో కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. ఊళ్ళో ఎవరి ఇంట్లోనైనా ఏవైనా వస్తువులు పోయినా, దొంగతనం జరిగినా మొట్టమొదట పోలీసులు ఈ కులం వారినే పట్టుకుపోయేవారు. క్రిమినల్‌ ట్రైబ్స్‌ యాక్ట్‌ ప్రకారం గుర్తింపు కార్డులు ఇచ్చేవారు. గుర్తింపు కార్డు లేనివారిని పట్టుకుపోయేవారు. ఈ రోజు వీరు అలాంటి అట్టడుగు వర్గాల ప్రజలతోపాటు మొత్తం బహుజన సమాజానికి స్ఫూర్తిగా నిలిచారు.
సమాజంలో అత్యంత వెనకబడిన వర్గం, అన్ని వర్గాలు చిన్నచూపు చూసే కులాల్లో ఎరుకల కులం ఒకటి. జీవితంలో ఆటుపోట్లు, సమాజం నుండి ఎదుర్కొన్న అవమానాలు, అవహేళనలను తట్టుకుని జీవితంలో ఏదైనా సాధించాలనే నమ్మకం, పట్టుదలతో సర్వే ఆఫ్‌ ఇండియాలో చిన్నపాటి ఉద్యోగిగా జీవితాన్ని ఆరంభించి, అదే సంస్థలో డైరెక్టర్‌గా అట్టడుగు వర్గం నుండి అత్యున్నత స్థాయికి ఎదిగిన బదునపురం కృష్ణస్వామి రియల్‌స్టోరీ...


చిరునామా

దళితశక్తి సామాజిక మాసపత్రిక
ఇంటి నెం.56, SCB 4-23-096, 
2వ అంతస్తు, డేవిడ్ మెమోరియల్ ప్రక్కన, 
 పికెట్, సికింద్రాబాద్-500009.
ఫోన్ నెం 94401 54273, 94900 98902.
ఇ-మెయిల్‌: dalithashakthi@gmail.com

No comments:

Post a Comment

2024 ఎన్నికల వార్ @ Online

 2024 ఎన్నికల వార్ @ Online  ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా లేని ప్రపంచాన్ని ఊహించలేం. ఏ విషయాన్ని అయినా విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు మన స...